హైదరాబాద్: రెబల్ స్టార్, పాన్ ఇండియా ఐకాన్ ప్రభాస్ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానుల కోలాహలం నెలకొంది. సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఆయనకు బర్త్‌డే విషెస్ చెబుతూ శుభాకాంక్షల నీరాజనాలు అర్పిస్తున్నారు. సినీ ప్రముఖుల ఆత్మీయ శుభాకాంక్షలుదర్శకుడు మారుతి:"పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభాస్. మీరు ఒక స్టార్ మాత్రమే కాదు... ఒక భావోద్వేగం, స్ఫూర్తి, అద్భుతం. ఎంత స్టార్ అయినా.. ఒదిగిఉండడం మీ ప్రత్యేకత. మీ కష్టపడే తత్వం, వినయం, నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. మీరు మరెన్నో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నా. ఎప్పటికీ అభిమానినే. ఎప్పటికీ మీతోనే ఉంటా."హీరో ఆది సాయికుమార్: "ప్రభాస్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ మంచితనం మిమ్మల్ని ఇంత గొప్పవారిని చేసింది. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని.. మరెన్నో మంచి సినిమాలతో మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నా."దర్శకుడు మెహర్ రమేష్: "హ్యాపీ బర్త్‌డే డార్లింగ్. మెరుపే మనిషైతే నీలా ఉంటుందేమో!"హీరో నారా రోహిత్:"పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభాస్. మీరెప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఇలానే స్ఫూర్తినిస్తూనే ఉండాలని కోరుకుంటున్నా."సోషల్ మీడియాలో వైరల్: జపాన్ ఫ్యాన్స్ స్పెషల్ సర్‌ప్రైజ్! పాన్ ఇండియా స్టార్‌గానే కాకుండా అంతర్జాతీయంగా అపారమైన క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్‌కు జపాన్ అభిమానులు ఒక ప్రత్యేకమైన వీడియోతో బర్త్‌డే విషెస్ తెలిపారు. ప్రత్యేకంగా కేక్ కట్ చేసి, బర్త్‌డే పాట పాడుతూ ప్రభాస్‌పై తమకున్న అపరిమిత అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో ప్రభాస్ జపాన్‌ను సందర్శించిన సమయాన్ని గుర్తుచేసుకుంటూ, "మళ్లీ ఒకసారి జపాన్‌కు రండి" అని ఆత్మీయంగా ఆహ్వానించారు. అంతేకాకుండా, ఆయన నటించే రాబోయే కొత్త సినిమాలను థియేటర్లలో చూడటానికి భారత్‌కు రావాలని ఉందని తమ సందేశంలో పేర్కొనడం విశేషం. ప్రస్తుతం జపాన్ ఫ్యాన్స్ షేర్ చేసిన ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
బర్త్‌డే స్పెషల్: ప్రభాస్‌కు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు.. జపాన్ ఫ్యాన్స్ మైండ్ బ్లా...
